అభిషేక్ పోరెల్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు

రిపోర్టర్: విజయ్ స్థలం: Kolkata

ఐపీఎల్ స్టార్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌కు చించూరా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటకకు చెందిన ఓ వైద్య విద్యార్థిని ఫిర్యాదు మేరకు అతడిని ఆగస్టు 11న పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, దాడికి పాల్పడి బెదిరింపులకు దిగాడని బాధితురాలు ఆరోపించారు. నెల రోజులకు పైగా జైలులో గడిపిన పోరెల్‌కు కోర్టు తాజాగా షరతులతో కూడిన బెయిల్ జారీ చేసింది.