మహానది బేసిన్‌లో సహజ వాయువును కనుగొన్న ONGC

రిపోర్టర్: కిరణ్ స్థలం: New Delhi

భారత ఇంధన భద్రతకు భారీ ఊతం లభించింది. మహానది బేసిన్‌లోని లోతైన సముద్ర జలాల్లో ONGC విజయవంతంగా సహజ వాయువును కనుగొంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభించిన సముద్ర మంథన్ మిషన్‌లో భాగంగా దేశంలోని లోతైన సముద్ర ప్రాంతాల్లో హైడ్రోకార్బన్ వనరులను వెలికితీసే ప్రయత్నాలు విజయవంతమవుతున్నాయి.