వ్యర్థాలతో సుందరంగా విజయవాడ బందరు కాలువ గట్టు
రిపోర్టర్: సురేష్
స్థలం: విజయవాడ
పనికిరాని వ్యర్థాలతో నగరాల సుందరీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విజయవాడలోని బందరు కాలువ గట్టును పాత ఇనుప సామాను, సిలిండర్లు, టైర్లు వంటి వ్యర్థాలతో తయారు చేసిన అందమైన శిల్పాలు, కళాఖండాలతో తీర్చిదిద్దారు. గతంలో పిచ్చిమొక్కలు పెరగడంతో కనుమరుగైన ఈ బొమ్మలను ఇటీవల అధికారులు తొలగించడంతో ఆ ప్రాంతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ బొమ్మల నిర్వహణ బాధ్యతలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టింది.