కడెం : ఆరు గ్యారెంటీల వైఫల్యాలపై బైక్ ర్యాలీ

రిపోర్టర్: Radha. A స్థలం: కడెం

కడెం: కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల వైఫల్యాలు, 1000 రోజుల విఫల పాలనను నిరసిస్తూ కడెం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, యువకులు, రైతులు, ప్రజలు భారీగా బైక్ ర్యాలీగా కడెం మండల కేంద్రానికి చేరుకున్నారు.

మండల మాజీ జెడ్పీటీసీ భూక్య అమ్మి బాపూరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అనంతరం ప్రజలకు బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నాయకులు విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.