గ్యారంటీ పథకాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలంటూ కర్ణాటక మంత్రి బాలకృష్ణ వ్యాఖ్యలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: బెంగళూరు

ఐదు గ్యారంటీ పథకాల భారంతో కర్ణాటక ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆ రాష్ట్ర మంత్రి హెచ్సీ బాలకృష్ణ పేర్కొన్నారు. రామనగరలో ఆందోళన చేస్తున్న దివ్యాంగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, గ్యారంటీలు ఇవ్వకపోతే ఆర్థిక నిర్వహణ ఎంతో సులభంగా ఉండేదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల మధ్య సమతుల్యత పాటించాల్సి వస్తోందని వివరించారు. అలవికాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసగించిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.