ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కరువు.. ఆరుతడి పంటలు సాగు చేయాలి!
రిపోర్టర్: హరి
స్థలం: Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు నెలలు కరువు తీవ్రతరమయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్పష్టమైంది. రాష్ట్రంలో 52 శాతం లోటు వర్షపాతం నమోదవడంతో, రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. తాగునీరు, పశుగ్రాస కొరత రాకుండా ఉండేందుకు రూ.90 కోట్లతో సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయాలని మరియు కేంద్రానికి ప్రత్యేక లేఖ రాయాలని నిర్ణయించారు.