ఆమనగల్ విద్యానగర్లో తీవ్ర తాగునీటి ఎద్దడిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డు విద్యానగర్ కాలనీలో నెలకొన్న తీవ్ర త్రాగునీటి ఎద్దడిని వెంటనే పరిష్కరించాలని కాలనీ అధ్యక్షుడు ఎంఏ పాషా మున్సిపాలిటీ కమిషనర్ రాఘవేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇవ్వడంతో పాటు సిసి రోడ్లు మరియు డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించాలని కోరారు.