ఉమ్మడి కృష్ణా జిల్లా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్: కూటమి హవా

రిపోర్టర్: విజయ్ స్థలం: కృష్ణా జిల్లా

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని, వెలువడుతున్న ఫలితాల్ లో కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యతతో దూసుకుపోతున్నారని అధికారులు తెలిపారు. విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీల్ లో అధికార కూటమి బలమైన స్థానాలను కైవసం చేసుకుంది. ఉయ్యూరు, జగ్గయ్యపేట, పెడన, నూజివీడు ప్రాంతాలలో టీడీపీ, జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించగా, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కేవలం కొన్ని స్థానాలకే పరిమితమైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.