గుర్గావ్ అడిడాస్ టెక్ హబ్ లో భారీ ఉద్యోగాల కోత

రిపోర్టర్: రాజేష్ స్థలం: హర్యానా

గుర్గావ్‌లోని ప్రముఖ స్పోర్ట్స్ వేర్ దిగ్గజం అడిడాస్ టెక్ హబ్‌లో రీస్ట్రక్చరింగ్ పేరుతో సుమారు మూడు వందల నుండి మూడు వందల యాభై మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ పరిణామంపై మాజీ ఉద్యోగి రిషబ్ గుప్తా లింక్డ్ఇన్ వేదికగా స్పందిస్తూ ఉద్యోగుల తొలగింపు కేవలం పాత్రల కోత కాదని, అది వాస్తవ వ్యక్తుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు రిఫరల్స్, సీవీ సమీక్షల రూపంలో సాయం అందిస్తానని ఆయన ముందుకు రావడం విశేషం.