'కోదాడలో మెగా జాబ్ మేళా': తెలంగాణ కాంగ్రెస్ ప్రకటన
రిపోర్టర్: సురేష్
స్థలం: Kodad, Suryapet
సూర్యాపేట జిల్లా కోదాడలో సెప్టెంబర్ 19వ తేదీన శనివారం భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో 300లకు పైగా కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని తెలిపింది. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ మరియు ఐటీఐ విద్యార్థులకు ప్రత్యేకంగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ స్పష్టం చేసింది.