పాలపిట్టల ప్రదర్శనపై అటవీ శాఖ హెచ్చరిక: చట్టపరంగా కఠిన చర్యలు

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

దసరా పండుగ వేళ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను బంధించి ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. సాంప్రదాయం పేరుతో మూగజీవాలను హింసించడం నేరమని తెలిపారు. ప్రజలు ఈ నిబంధనలను పాటించాలని, ప్రత్యేక బృందాలు నిఘా ఉంచాయని అధికారులు వెల్లడించారు.