రైతు బజార్లలో రూ.35 కే కిలో ఉల్లిపాయలు

రిపోర్టర్: రాము స్థలం: Andhra Pradesh

రాష్ట్రంలో నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రైతు బజార్లలో కేజీ ఉల్లి రూ.35 కే అందించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. కృత్రిమ కొరత సృష్టిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకే పామాయిల్, నాణ్యమైన సరుకులు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.