అమెరికాలో అసాధ్యంగా మారుతున్న సొంతింటి కల: భారం అవుతున్న డౌన్ పేమెంట్
రిపోర్టర్: విజయ్
స్థలం: అమెరికా
అమెరికాలో మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల నెరవేరడం గగనంగా మారుతోందని సీఎన్బీసీ, సర్వే మంకీ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. అద్దె ఇళ్లలో ఉంటున్న వారిలో ముప్ పై నాలుగు శాతం మంది తాము ఎప్పటికీ ఇల్లు కొనలేమని భావిస్తున్నట్లు సర్వే స్పష్టం చేసింది. డౌన్ పేమెంట్ చెల్లించడానికి సరైన పొదుపు లేకపోవడం, పెరుగుతున్న ఇళ్ల ధరలతో పాటు అధిక వడ్డీ రేట్లు ప్రజలను తీవ్రంగా భయపెడుతున్నట్లు నివేదిక తేల్చిచెప్పింది.