ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బొత్స కుటుంబానికి వైయస్సార్సీపీ అధినాయకత్వం భారీ షాక్

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయనగరం

ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స కుటుంబానికి వైయస్సార్సీపీ అధిష్ఠానం గట్టి షాకిచ్చింది. బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు పార్టీ వీడటంతో, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడిని నెల్లిమర్ల ఇంచార్జ్ బాధ్యతల నుంచి తొలగించారు. బొత్స ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెడుతూ, పార్టీలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేసేందుకు జగన్ ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.