యూపీఐ లావాదేవీలపై మోదీ సర్కార్ కొత్త కుట్ర: రాహుల్ గాంధీ

రిపోర్టర్: సురేష్ స్థలం: భారతదేశం

యూపీఐ చెల్లింపులపై కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రూ.2 వేలకు మించిన వ్యాపార లావాదేవీలపై ఎండీఆర్ విధించేందుకు కేంద్రం మార్గం సుగమం చేస్తోందని ఆరోపించారు. అమెరికా చెల్లింపు సంస్థల ఒత్తిడికి ప్రధాని మోదీ మరోసారి లొంగిపోయారని, చివరకు ఈ భారం వినియోగదారుల జేబుపైనే పడుతుందని ఆయన మండిపడ్డారు.