పంజాబ్ లో ఆప్ కు భారీ షాక్: ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
రిపోర్టర్: రాము
స్థలం: Chandigarh
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాటియాలా జిల్లాలోని సమానా ఎమ్మెల్యే చేతన్ సింగ్ జోరామజ్రా, సనూర్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్మాజ్రా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తొలి జాబితా విడుదల చేసిన మరుసటి రోజే ఇద్దరు నేతలు ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం రేపింది.