ఏపీపీఎస్సీ ద్వారా 892 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీపీఎస్సీ ద్వారా 892 ఉద్యోగాల భర్తీకి 20 నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో గ్రూప్-1 పోస్టులు 163 ఉన్నాయి. అక్టోబరు 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. నిరుద్యోగ యువతకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పెంచుతూ నాన్ యూనిఫాం ఉద్యోగాలకు 44 ఏళ్ల వరకు అవకాశం కల్పించింది.