బకాయిపడ్డ రూ.41 వేల రైతు భీమా సొమ్మును వెంటనే ఇవ్వాలి
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ కింద మూడేళ్లలో రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం రూ.19 వేలు మాత్రమే ఇచ్చారని వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం బకాయిపడ్డ రూ.41 వేలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.