అనంతపురంలో ఘర్షణల కలకలం: మున్సిపల్ ఎన్నికల్ లో టీడీపీ, వైఎస్సార్సీపీ బాహాబాహీ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అనంతపురం
మున్సిపల్ ఎన్నికల వేళ అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య ఘర్షణలు చెలరేగామని వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ వెల్లడించారు. 38వ డివిజన్ లో దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఉద్రితంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారని, ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని అధికారులు పేర్కొన్నారు.