నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు

రిపోర్టర్: VG ReddyD SrJournalist స్థలం: నెల్లూరు

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలలో పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం ఐదు లక్షల యాభై వేలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఐదు వేలకు పైగా సిబ్బందిని ఏర్పాటు చేశారు.