అమెరికాలో టెకీ తీవ్ర ఇబ్బందులు: ఐఐటీ పూర్వ విద్యార్థికి ఉద్యోగ సంక్షోభం

రిపోర్టర్: గోపి స్థలం: Dallas

అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా దశాబ్దాలుగా పనిచేసిన ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి గౌతమ్ దేవ్ ఉద్యోగం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించారు. అమెరికాలోని డల్లాస్లో నివసిస్తున్న అరవై ఒక్క ఏళ్ల ఆయన, కంపెనీ మారమన్న నిబంధనతో ఉద్యోగం వదులుకున్నానని, కొత్త ఉద్యోగం దొరకక అద్దెలు చెల్లించలేక భారత్కు తిరిగి వెళ్లే ఆలోచన చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.