ముంబై మెట్రో స్టేషన్లో ప్రత్యేక ఉమ్మేసే కేంద్రం ఏర్పాటు
రిపోర్టర్: కిరణ్
స్థలం: ముంబై
ముంబై మెట్రో స్టేషన్లో అధికారులు ప్రత్యేకంగా ఉమ్మేసే కేంద్రాలను ఏర్పాటు చేయడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. జోరు భతేనా అనే వ్యక్తి ఈ చిత్రాలను ఎక్స్ వేదికగా పంచుకోగా, దీనిపై నెటిజన్లు భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడాన్ని పూర్తిగా నిషేధించాలని కొందరు కోరుతుంటే, ఇది మంచి తాత్కాలిక పరిష్కారమని మరికొందరు సమర్థిస్తున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు.