హాలీవుడ్ నటులు బెన్, కేసీ అఫ్లెక్ తండ్రి కన్నుమూత
రిపోర్టర్: రాజేష్
స్థలం: World
ప్రముఖ హాలీవుడ్ నటులు బెన్ అఫ్లెక్, కేసీ అఫ్లెక్ ల తండ్రి టిమోతీ టిమ్ బైర్స్ అఫ్లెక్ కన్నుమూశారు. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా కేసీ అఫ్లెక్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది తమ తల్లి క్రిస్టోఫర్ అఫ్లెక్ ను కోల్పోగా, తాజాగా తండ్రి కూడా మరణించడంతో ఈ కుటుంబంలో విషాదం అలుముకుంది. అఫ్లెక్ సోదరులు తమ తల్లిదండ్రులను కోల్పోవడం పట్ల హాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.