నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ మూవీకి ఏ సర్టిఫికెట్

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

నటుడు నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. భారీ యాక్షన్ మరియు హింసాత్మక సన్నివేశాలు ఉండటంతో ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఖాయమని ముందే ఊహించినట్లు ముంబైలో జరిగిన ప్రెస్ మీట్‌లో నాని తెలిపారు. ఈ సినిమాలో హింసతో పాటు బలమైన భావోద్వేగాలు, డ్రామా, ప్రేమ కూడా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.