హుతీల దాడులపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని సౌదీ అరేబియా డిమాండ్

రిపోర్టర్: కిరణ్ స్థలం: రియాద్

హుతీ తిరుగుబాటుదారుల క్షిపణి మరియు డ్రోన్ దాడులను ఖండిస్తూ అంతర్జాతీయ సమాజం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ ఐక్యరాజ్యసమితి వేదికగా డిమాండ్ చేశారు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు నావిగేషన్ స్వేచ్ఛకు పెను ముప్పుగా మారుతున్నాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యెమెన్కు తమ దేశం తరఫున ఇప్పటివరకు ఇరవై తొమ్మిది బిలియన్ డాలర్లకు పైగా మానవతా సహాయం అందించామని సౌదీ స్పష్టం చేసింది.