శ్రీకాకుళంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ: రహదారుల పునరుద్ధరణకు చర్యలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా పోలీసుల వెల్లడి ప్రకారం, అర్నబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎచ్చెర్ల మండలంలోని కుప్పిలి ముంపు ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణ కోసం జిల్లా పోలీసులు తక్షణ చర్యలు చేపట్టారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు ముమ్మరం చేసింది.