ఇస్రో మరో ఘనత: ఎన్వీఎస్-03 ఉపగ్రహ కక్ష్య పెంపు విజయవంతం
రిపోర్టర్: అశోక్
స్థలం: సూళ్లూరుపేట
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక మైలురాయిని అధిగమించినట్లు ఇస్రో అధికారులు తెలిపారు. నావిగేషన్ వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎన్వీఎస్-03 ఉపగ్రహానికి నిర్వహించిన మూడో, చివరి కక్ష్య పెంపు ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని వెల్లడించారు. శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్-18 నౌక ద్వారా నింగిలోకి పంపిన ఈ ఉపగ్రహం తాజా విన్యాసంతో నిర్దేశిత భూ సమకాలిక కక్ష్యలోకి చేరిందని స్పష్టం చేశారు.