విశాఖలో ప్రజల సమస్యలపై సీపీ పిజిఆర్ఎస్ నిర్వహణ
రిపోర్టర్: రాజేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నగరంలో పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. నగర పోలీసు కమిషనర్ స్వయంగా వంద మంది ఫిర్యాదిదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించి సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని, ఫిర్యాదులపై సత్వరమే స్పందించి పరిష్కారం చూపాలని అధికారులను సీపీ ఆదేశించారు.