పంజాబ్ లో షాకింగ్ ఘటన: ఇంట్ లో డ్రగ్స్ పెట్టిన ఏఎస్ఐ సస్పెన్షన్

రిపోర్టర్: కృష్ణ స్థలం: లూధియానా

పంజాబ్ లోని లూధియానా జిల్లాలో శివసేన నేత ఇంట్ లో పోలీసులే డ్రగ్స్ ప్యాకెట్ పెట్టిన ఘటన కలకలం సృష్టించింది. మత గురువు మహంత్ కశ్మీర్ గిరి నివాసంలో సోదాల సమయంలో ఏఎస్ఐ సుఖ్దేవ్ సింగ్ మంచం పరుపు కింద హెరాయిన్ ప్యాకెట్ ఉంచుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సదరు ఏఎస్ఐని సస్పెండ్ చేశారు. మహంత్ను కేసు నుంచి విడుదల చేయగా, ఈ ఉదంతంపై అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆప్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.