గిరిజన బీసీ మోర్చా అధ్యక్షుల నియామకంతో జోరందుకున్న కమల దళం
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్లు
ఆమనగల్లు మండల పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బాణావత్ లాలు నాయక్ గారిని ఆమనగల్లు గిరిజన మోర్చా అధ్యక్షులుగా, గండికోట జంగయ్య గారిని మండల బీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమించారు. తల్లోజు ఆచారి పిలుపు మేరకు మండల బీజేపీ అధ్యక్షులు ఎర్రవోలు శ్రీనివాస్ ఈ నియామకాలు చేపట్టారు. ఈ సందర్భంగా లాలు నాయక్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం శ్రద్ధగా పని చేస్తామని, పార్టీ విధివిధానాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.