ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు: విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంపు
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక సంక్షేమ, అభివృద్ధి అంశాలకు ఆమోదం తెలిపిందని అధికారులు వెల్లడించారు. సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో డైట్ ఛార్జీలను పది శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే గిరిజన విద్యార్థులకు ఉచిత కోచింగ్, విద్యా చట్ట సవరణతో పాటు ఏపీహెచ్ఐఎంఎస్ ఏర్పాటుకు కేబినెట్ సానుకూలత వ్యక్తం చేసింది.