చిన్నతాడి గ్రామంలో ఇంటింటా తెలుగుదేశం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నాయకుల పర్యటన!
రిపోర్టర్: santhoshkumar
స్థలం: గాజువాక
విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని క్లస్టర్ 10 బూత్ నెంబర్ 237 చిన్నతాడి గ్రామంలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. గత రెండు సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ, ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ 10 ఇంచార్జ్, ఎక్స్ కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్, ఎక్స్ సర్పంచ్ బొడ్డుపల్లి అప్పారావు, దానబోయిన నీలకంఠ రావు, బూత్ కన్వీనర్లు నక్కపరమట్టయ్య, గుమ్మాల రాము తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.