తిరుమలలో నూతన హంగులతో ఎస్వీ మ్యూజియం ప్రారంభం.

రిపోర్టర్: రాజేష్ స్థలం: తిరుపతి

తిరుమలలో ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి ఆయన మ్యూజియంను పరిశీలించారు. శ్రీవారి ఆభరణాల త్రీడీ మోడల్స్, చారిత్రక వస్తువులు, ఏఐ టెక్నాలజీతో శ్రీవారి పరిణయ విశేషాలు, అన్నమాచార్యుల సంగీత వాయిద్యాలను మ్యూజియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భక్తులకు తిరుమల విశిష్టతను తెలిపేలా అద్భుతమైన ప్రదర్శనలు కొలువుదీరాయి.