తమిళనాడు ప్రభుత్వంలో తెలుగు త్రయం జోక్యంపై దుమారం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తమిళనాడు

తమిళనాడులో సీఎం విజయ్ ప్రభుత్వంపై డీఎంకే తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వంలో ఎటువంటి పదవులు లేకపోయినా విష్ణు రెడ్డి, సుజయ్ రెడ్డి, అనిల్ రెడ్డి అనే తెలుగు వ్యక్తులు మైనింగ్ కాంట్రాక్టులు, కీలక శాఖలను శాసిస్తున్నారని విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సభలో ఆరోపించారు. మంత్రులను పక్కనబెట్టి ప్రైవేటు వ్యక్తులకు పవర్ కట్టబెట్టారని మండిపడ్డారు.