మహబూబ్‌నగర్ ఎంవీఎస్ కళాశాల అభివృద్ధికి రూ.70 కోట్ల నిధులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.70 కోట్లతో సమగ్ర ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. తొలి విడతగా రూ.20.50 కోట్లతో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కళాశాలను తెలంగాణలోనే నంబర్ వన్‌గా మారుస్తామని, విద్యార్థుల కోసం అత్యాధునిక కోర్సులు, బాలికల హాస్టల్, జూనియర్ కళాశాలలో పబ్లిక్ స్కూల్ తరహా వసతులు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.