బీఆర్ఎస్ ఎమ్మెల్సీల శాశ్వత సభ్యత్వ రద్దుపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్‌ రెడ్డిల సభ్యత్వాలను శాశ్వతంగా రద్దు చేసే దిశగా అధికార కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. సభా నిబంధనల ఉల్లంఘన పేరుతో వీరి వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీకి అప్పగించి, సభ్యత్వ రద్దుకు సిఫార్సు చేయించే యోచనలో ప్రభుత్వం ఉంది. విపక్ష సభ్యుల దూకుడుకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.