పాఠశాల ప్రవేశాలపై కీలక నిర్ణయం: మొదటి తరగతికి ఆరేళ్లు తప్పనిసరి
రిపోర్టర్: మహేష్
స్థలం: మహారాష్ట్ర
పాఠశాల ప్రవేశాల విధానంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టిందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. జాతీయ విద్యా విధానం ప్రకారం భవిష్యత్తులో మొదటి తరగతి ప్రవేశానికి కనీసం ఆరేళ్ల వయసు ఉండాలని స్పష్టం చేశారు. ఈ నూతన నిబంధనలను విడతలవారీగా అమలు చేయనున్నట్లు పేర్కొంటూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ బోర్డుల పరిధిలో ఉన్న పాఠశాలల్లో ప్రవేశాల వయసుపై స్పష్టత తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.