బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లకు నాగార్జున గట్టి క్లాస్
రిపోర్టర్: నరేష్
స్థలం: Hyderabad
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారం వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున కంటెస్టెంట్ల ఆట తీరుపై తీవ్రంగా స్పందిస్తూ పలువురికి క్లాస్ పీకారు. సృష్టి, కృష్ణ ఆటలో సరిగ్గా కనిపించకపోవడంతో వారిని మూలలో కూర్చోబెట్టగా, సంచాలక్‌గా వ్యవహరించిన వర్షిణి నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తమైంది. షాలినీ ప్రవర్తన, రోహిత్ అతి ఉత్సాహం, వంశీ వంట తీరును తప్పుబట్టిన నాగార్జున పగటిపూట నిద్రపోరాదంటూ కొత్త నిబంధనను ప్రకటించి, ముఖేష్, షాలినీ, రామ్ ప్రసాద్, ఝాన్సీ, దేబ్జానీలు సేఫ్ అయినట్లు తెలిపారు.