తిరుపతి బుగ్గమఠం భూముల వివాదం: పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో భారీ షాక్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: దిల్లీ

తిరుపతి బుగ్గమఠం భూముల ఆక్రమణ వ్యవహారంలో వైకాపా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ భూములను ఖాళీ చేయాలన్న మఠం ఈవో ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే దేవాదాయ ట్రైబ్యునల్ను ఆశ్రయించాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ట్రైబ్యునల్ను ఆశ్రయించేందుకు ఆయనకు నాలుగు వారాల గడువు ఇస్తూ జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్ను పరిష్కరించింది.