లక్ష మందితో కేసీఆర్ పాదయాత్ర: హరీష్ రావు

రిపోర్టర్: chandrareddy damidi స్థలం: గజ్వేల్

అసెంబ్లీ సమావేశాలు నెల రోజుల పాటు నిర్వహించాలనీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనీ ఆదివారం రోజున సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రబెల్లి లోని కేసీఆర్ ఫామ్ హౌజ్ లో జరుగుతున్న బిఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం లో సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ అన్ని వర్గాలకు అన్యాయం చేసింది. కాళేశ్వరంపై నిర్లక్ష్య ధోరణికి నిరసనగా అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆందోళన. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై కేసీఆర్ ప్రత్యక్ష పోరాటం మరియు లక్ష మంది తో పాద యాత్ర చేస్తారన్నారు.