మహారాష్ట్ర ఎఫ్‌డీఏ చీఫ్ తుకారామ్ ముండేను ప్రశంసించిన నటి మల్లికా షెరావత్

రిపోర్టర్: కృష్ణ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్ర ఆహార మరియుషౌషధ నియంత్రణ శాఖ ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారామ్ ముండే చేపట్టిన కల్తీ నిరోధక చర్యలను ప్రముఖ బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ తీవ్రంగా అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఇడ్లీ తింటూ చేసిన వీడియోలో తుకారామ్ ముండే తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాల వల్ల ప్రజలు సురక్షితంగా ఉంటున్నారని, ఆయన నిఘా నుంచి ఏదీ తప్పించుకోలేదని ప్రశంసించారు. ఆయన క్రమశిక్షణ, నిబద్ధత ప్రజల్లో భరోసా కల్పిస్తున్నాయని ఆమె కొనియాడారు.