తితిదే గోసంరక్షణ ట్రస్టుకు కోటి పైచిలుకు విరాళం

రిపోర్టర్: కిరణ్ స్థలం: తిరుమల

తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన కుంచాల మధురాంరెడ్డి కుటుంబ సభ్యులు కోటీ పదకొండైదు వేల రూపాయల భారీ విరాళం అందజేశారు. హైదరాబాద్‌లోని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు క్యాంపు కార్యాలయంలో ఆయనకు ఈ డీడీని అందజేయగా, దాతల ఉదారతను ఛైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు.