డక్కిలి మండలంలో ఓటర్ల మద్దతు కోరుతూ హోరెత్తిన టీడీపీ ప్రచారం

రిపోర్టర్: kummaragunta masthanaiah స్థలం: డక్కిలి

తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఎంపీటీసీ అభ్యర్థి పాయసం కోటి రామాపురం తోపుగానపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. స్థానిక ఓటర్లను కలిసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. గ్రామాల్లోని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.