నెల్లిమర్ల వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా సముద్రపు రామారావు ఎంపిక

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నెల్లిమర్ల

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ వైఎస్ఆర్ సీపీ చైర్మన్ అభ్యర్థిగా సముద్రపు రామారావును అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్గా సేవలందించిన ఆయన, ప్రస్తుతం పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నారు. తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, నేడు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.