ఆసియా క్రీడల్లో రజతం సాధించిన షూటర్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందనలు

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ టీమ్ ఈవెంట్లో రజత పతకం సాధించిన ఏపీఎస్ తోమర్, రుద్రాంక్ష్ పాటిల్, నీరజ్ కుమార్లను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, క్రీడాకారులు ప్రదర్శించిన అత్యుత్తమ ఏకాగ్రత, పట్టుదల దేశానికి గర్వకారణమని ప్రశంసించారు. అద్భుతమైన టీమ్వర్క్తో దేశం కీర్తిని ఇనుమడింపజేశారని కొనియాడారు. ముగ్గురు క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.