రాప్తాడు హైస్కూల్ లో విద్యార్థినిపై దాడి: సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
రిపోర్టర్: విజయ్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్ లో పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది దాడి చేయడం అత్యంత దారుణమని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి ఘాతకాలకు పాల్పడే వారికి సమాజంలో చోటు లేదని, ఉన్మాదులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హెచ్చరించారని అధికారులు తెలిపారు.