ఘనంగా గణేష్ ఉత్సవాలు నిజామాబాద్ జిల్లా వెల్మల్ ప్రత్యేకత
రిపోర్టర్: రమేష్
స్థలం: నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామం గణేష్ ఉత్సవాలకు ప్రత్యేక వేదికగా నిలిచింది. దేశ నలుమూలల నుంచి 30కి పైగా భారీ గణనాథ ప్రతిమలను తీసుకొచ్చి కులాలకు అతీతంగా పూర్వ విద్యార్థులు, యువకులు మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్, ముంబై, పూణే నగరాల నుంచి లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రత్యేక డీజేలను తెప్పిస్తుండగా, ఉత్సవాల కోసం కోటి నుంచి కోటిన్నర వరకు ఖర్చు చేస్తూ ఎలాంటి వివాదాలు లేకుండా ఘనంగా నిర్వహిస్తున్నారు.