అమెరికాలో వైభవంగా టీటీఏ బతుకమ్మ మరియు దసరా సంబరాలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమెరికా

అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రజల కోసం తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో టీటీఏ నేషన్‌వైడ్ 2026 బతుకమ్మ, దసరా సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అక్టోబర్ 10 నుంచి వివిధ నగరాల్లో వేడుకల షెడ్యూల్‌ను నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. సంఘం అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లెపెద్ది, ఫౌండర్ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఈ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.