ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి :డా శివప్రసాద్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నాంపల్లి

ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే కార్యక్రమాలకు హాజరై విద్యార్థులను ప్రోత్సహించాలని డా. చినుకని శివ ప్రసాద్ కోరారు.

ప్రభుత్వ పాఠశాలల కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు, ఉపాధ్యాయులకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు ఇటువంటి భాగస్వామ్యం దోహదపడుతుందని పేర్కొన్నారు.

ప్రైవేట్ పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలలకూ సమాన ప్రాధాన్యత లభించేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రోత్సాహం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలలకు ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం పెరిగితే విద్యార్థుల్లో నమ్మకం పెరుగుతుంది.. ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి మార్గం సుగమమవుతుంది అని డా. శివ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.