కామన్వెల్త్ గేమ్స్ జూడోలో స్వర్ణ పతకం సాధించిన అస్మిత డే
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Tripura
భారత జూడో చరిత్రలో తొలిసారిగా కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతకం సాధించి అస్మిత డే సంచలనం సృష్టించారు. త్రిపురలోని బెలోనియాకు చెందిన ఈ 24 ఏళ్ల అథ్లెట్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. చిన్నతనంలో కనీసం తిండికి కూడా నోచుకోని రోజులు ఉన్నాయని, కేవలం నీళ్లు తాగి నిద్రపోయిన సందర్భాలున్నాయని అస్మిత డే ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే తాను ఈ విజయాలను సాధించగలిగానని ఆమె వెల్లడించారు.